Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహచ్ మల్లారెడ్డి
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
- శాఖాహార, మాంసాహార మార్కెట్ పనుల పరిశీలన
నవతెలంగాణ-జవహర్‌నగర్
దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందనీ, అభివృద్ధి వైపు చూస్తుందనీ, ప్రగతి పనులతో రాష్ట్రం పురోగతి సాధిం చిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కార్పొరేషన్లో తహశీల్దార్ అనిత అధ్యక్షత తహశీల్దార్ మీటింగ్ హాల్లో మంత్రి మల్లారెడ్డి, అడిషినల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివా స్తో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలను తీర్చడానికి కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం దళితబంధు ప్రవేశపెట్టిందన్నారు. అభివృద్ధి పనుల్లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం 49మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు,, రెవెన్యూ ఇన్స్పె క్టర్ విశ్వనాథ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
శాఖాహార, మాంసాహార మార్కెట్ పనుల పరిశీలన..
రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన సమీకృత మాంసాహార, శాఖాహార మార్కెట్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికా రులకు మంత్రి మల్లారెడ్డి సూచించారు. కార్పొరేషన్ ప్రజలకు సకల సౌకర్యాలతో శాఖాహార, మాంసాహార మార్కెటును అందుబాటులోకి తెస్తామన్నారు. కార్పొరేషన్ అభివృద్ధిలో అధికారులు, పాలకవర్గం సభ్యులు ముందుండాలన్నారు. గ్రూపు లు వద్దు.. అభివృద్ధి ముద్దు అన్నారు. అన్ని డివిజన్లలో ప్రగతి పనులు సమానంగా జరుగుతాయనీ, కొందరు కావాలని గ్రూపులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిం చారు. ప్రతి ఒక్కరూ డివిజన్లలో పర్యటించి అభివృద్ధిపై దృష్టి సారించాలని చెప్పారు.