Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడిజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో కాలుష్య నిర్మూలన మహాసభ నిర్వహించను న్నట్టు ప్రొటెక్షన్ జాతీయ అధ్యక్షులు లింగంపల్లి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కార్కానాలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో చంద్రశేఖర్ మాట్లాడారు. పదేండ్లుగా తాము కాలుష్యాన్ని నిర్మూలించి పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర స్థాయిలో పోరాటం చేస్తూ ప్రజల్లో అవగాహణ కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో కూడా అవగాహనా కార్యక్రమంలో భాగంగా మహాసభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ ప్రేమికులు, విద్యావేత్తలు, మేధావులందరూ ఈ నెల 26వ తేదీన జరిగే మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, సీహెచ్. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యే లు, పలువురు ప్రముఖులు హజరుకానున్నట్టు వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘనపురం గంగరాజు, రాష్ట్ర అధ్యక్షులు గండమాల యాదయ్య, ఉపాధ్యాక్షులు ఎ.వేణుగోపాల్, వి.రాములు, తదితరులు పాల్గొన్నారు.