Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో జెడ్ సర్టిఫికెట్ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ, మార్కెట్‌ను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ భవనంలో గురువారం పారిశ్రామికవేత్తల సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ కె.గోవిందారెడ్డి అధ్యక్షతన ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ అధ్యరంలో జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ పై పారిశ్రామికుల వేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదంతో పారిశ్రమిక రంగంలో పలు విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందన్నారు. ముఖ్యంగా జెడ్ సర్టిఫికెట్తో డెఫన్స్, పీఎస్‌యూ, బ్యాంకింగ్, డీఆర్డీఓ, ప్రభుత్వ రంగ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేయవచ్చని చెప్పారు. జెడ్ కో- ఆర్డినేటర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలకు ఉద్యోగ్ ఆధార్ సంఖ్య తప్పక ఉండాలనీ, వాటి సంఖ్యా ద్యారా జెడ్ సర్టిఫికెట్ పొందవచ్చని పవర్ పాయింట్ ద్యారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో ఐలా చైర్మన్ జక్కా రిసిరెడ్డి, వెంకటరత్నం, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఆర్సీ రెడ్డి, వినోద్ కుమార్, గందాధర్ బాబు, దత్త, సురేష్ శ్రీనివాస్, పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.