Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నగరంలో ప్రసిద్ధి చెందిన మిఠాయి సంస్థ ఆల్మండ్ హౌస్లో వార్షిక కేక్ మిక్సింగ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం కూకట్పల్లిలోని వారి ప్రొడక్షన్ ఫెసిలిటీలో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్మండ్ హౌస్ సంస్థ సీఈఓ చైతన్య ముప్పాల, ఆ సంస్థ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ మిక్సింగ్ చేశారు. ఈ సందర్భంగా చైతన్య ముప్పాల మాట్లాడు తూ టేస్ట్ మేకర్స్ ఆఫ్ హైదరాబాద్గా పిలువబడే ఆల్మండ్ హౌస్, టేస్ట్మేకర్స్ ఆఫ్ జారుగా, రాబోయే పండుగల సీజన్ కోసం మా ప్లం కేక్స్ను ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా 5 రకాల కొత్త రుచులతో మీ ముందుకు తెస్తున్నామనీ, అందరూ వీటి రుచులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ రిటైల్ సిబ్బంది, ప్రొడక్షన్ స్టాఫ్, కార్పొరేట్ ఆఫీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.