Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ఆరోగ్యకర మైన వాతావరణాన్ని కల్పించే పారిశుధ్య కార్మికులపై దాడి హేయమైన చర్య అని మేయర్ మేకల కావ్య అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్యాయలంలో ము న్సిపల్ కార్మికులపై దాడిని నిరసిస్తూ మేయర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడు తూ కార్మికుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తప్పవన్నా రు. కార్మికులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలి పారు. కార్పొరేషన్‌లోని కార్మికనగర్‌లో గురువారం కాలనీల ను శుభ్రం చేస్తుండగా విధులకు ఆటంకం కలిగిస్తూ బీహార్‌కు చెందిన వ్యక్తులు కార్మికులను కొట్టడంతో గాయ పడ్డారు. దాడిలో గాయపడ్డ కార్మికులను మేయర్ పరామ ర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీఓ ప్రభాకర్‌యాదవ్, కార్మిక సంఘం నాయకులు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.