Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి
- శ్రీలంక బస్తీలో కార్డన్ సెర్చ్
నవతెలంగాణ-బేగంపేట
అభద్రతా భావం తొలగించడానికే తరుచూ ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్టు ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి తెలి పారు. శుక్రవారం ఉదయం తెల్లవారు జామున బేగంపేట పోలీస్టేషన్ పరిధిలోని శ్రీలంక బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏసీప ీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తం సుమా రు 4 వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనం తరం సాయంత్రం బేగంపేట పోలీస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వివరా లను వెల్లడించారు. నేరాలు జరిగే అవకాశాన్ని ముందు గానే గుర్తించడం, అదుపు చేయడం కోసం నిర్బంధ తనిఖీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జనావాసా ల్లో నేరస్తులు, అనుమానితులు ఎక్కువగా ఉండే అవకాశమున్న శ్రీలంక బస్తీలో ఈ తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 11 మంది అనుమానితులతో పాటు నలుగురు రౌడీషీటర్స్ను అదుపులోకి తీసుకుని విచారించినట్టు చెప్పారు. మరో వైపు గుట్కాలు తరిలిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 800 గుట్కా ప్యాకెట్స్ పట్టుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీపీసీ అశీష్ గౌతం, ఏసీపీ పధ్వీధరావు, బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.