Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
విద్యార్థుల్లో యువ నాయకుల నాయకత్వ లక్షణాల ను వెలికితీసేందుకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో శుక్రవారం 2022 లీడర్షిప్ బూట్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. చైర్మెన్ ఎం.కొమర య్య అధ్యక్షతన సీనియర్ ప్రిన్సిపాల్ నందిత సుంకర ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ పల్లవి మల్కా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యశస్వి మల్కా, ప్రిన్సిపల్ సునీతరావు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో జంట నగరాల్లోని 28 ప్రముఖ పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. శుక్రవారం మొదటి రోజుగా అధికారిక ఆహ్వానం తర్వాత, సమావేశంను సునీతరావు ప్రారంభిం చారు. ప్రిన్సిపాల్ అతిథి బ్రిగేడియర్ రెడ్డి, ఇండియన్ ఆర్మీ సామర్థ్యాలను ఆహుతులకు పరిచయం చేశారు. ది హిందూ న్యూస్ పేపర్ డిప్యూటీ ఎడిటర్ రవికాంత్ రెడ్డి పాల్గొని సమాచార నైపుణ్యాలపై జరిగిన సమావేశం, జర్నలిజంలోని కీలక నైపుణ్యాలు, సమాచార శక్తిని గురించి పరిచయం చేశారు. సెషన్లో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ మన్నె విద్యార్థి నాయకులు నిర్భయంగా ఉండాలనీ, ధైర్యంగా నిలబడాలని వివరించారు. సామాజిక శాస్త్రజ్ఞుడు ఆజం ఖాన్ మాట్లాడుతూ సమాజ సేవ ప్రాధాన్యత గురించి చర్చించారు. అనంతరం జీవన నైపుణ్యాలు జట్టుగా నిర్వ హించు కార్యక్రమాలపై సమావేశంలో రిత్విక్ ర్యాకాస్, స్పీకర్ నిజాయితీ బాధ్యత విలువలను తెలిపారు.