Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ వై.కిరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సంకల్ప్ దివస్
- ఈనెల 28న అవార్డును ప్రదానం చేయనున్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బంజారాహిల్స్
ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణారాయ్.. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 'సంకల్ప్ కిరణ్ పురస్కార్' అవార్డుకు నామినేట్ అయ్యారు. మానవతావాది, దార్శనికుడు డాక్టర్ వై.కిరణ్ జన్మదినం సందర్భంగా 'సంకల్ప్ దివస్ 2022' (నవంబర్ 28) సందర్భంగా పీపుల్స్ ప్లాజా (నెక్లెస్‌రోడ్)లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా సంకల్ప్ సంజీవని పురస్కర్ (ఆరుగురు గ్రహీతలు), వికలాంగులైన పిల్లలు, వ్యక్తులకు గొప్ప సేవ చేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించడానికి సంకల్ప్ సిద్ధి పురస్కారాలు అందిస్తారు. రక్షణ మంత్రిత్వశాఖలో మాజీ డిప్యూటీ డైరెక్టర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, రెండుసార్లు సివిల్స్ ర్యాంకర్, సామాజిక కార్యకర్త, మోటివేటర్ అయిన బాలలత, రెండుసార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎం.శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి సంకల్ప విశిష్ఠ అతిథులుగా హాజరవుతారు. పురస్కారం అందుకుంటున్న సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ అరుణారాయ్ మాట్లాడుతూ సంకల్ప్ కిరణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు ఎంత సంతోషంగా ఉందన్నారు. తన పుట్టినరోజును విభిన్నంగా చేసుకుంటున్న డాక్టర్ వై. కిరణ్‌ను అభినందిస్తున్నాను అని తెలిపారు. తన పుట్టినరోజు సమయాన్ని ప్రత్యేక అవసరాలున్న ప్రత్యేక పిల్లలతో గడపాలన్న ఆయన విధానం ఎంతో అభినందనీయమన్నారు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి, ఇవ్వడాన్ని విశ్వసించే అలాంటి వ్యక్తులు భారతదేశానికి మరింత అవసరమని చెప్పారు. ఈ గౌరవాన్ని అందుకోవడానికి, ఈ సందర్భాన్ని అందరితో కలిసి చేసుకోవడానికి తాను వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరవుతాను అని తెలిపారు. సుచిర్ ఇండియా చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ 'మీరు పోగుపడినప్పుడు కాదు, మీరు ప్రపంచంతో పంచుకున్నప్పుడు ఆనందం. ప్రతీ సమర్థుడైన వ్యక్తి సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మన కోసం, మన భవిష్యత్తు తరాల కోసం ఒక అందమైన భవిష్యత్తును నిర్మిస్తా. సమాజ శ్రేయస్సు కోసం కషి చేసే వ్యక్తులు మనలో చాలా మంది ఉన్నారు. ఈ సంకల్ప్ అవార్డులు వారి గొప్ప పనిని గుర్తించడానికి, వారిని మరింత చేయడానికి ప్రోత్సహించే ప్రయత్నం. ఈ సంవత్సరం కూడా, మేము కొన్ని సామాజిక సంస్థలను, గొప్ప పని చేస్తున్న వ్యక్తులను ఎంచుకున్నాం' అన్నారు.