Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
దేశవ్యాప్తంగా వన్యప్రాణులపై జూ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని న్యూఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ సంజరు కుమార్ శుక్లా అన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో మూడు రోజుల జూ బయాలజిస్ట్ వర్క్‌షాప్ వాలెడిక్టరీ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో వన్యప్రాణుల శిక్షణలో భాగంగా 10 రాష్ట్రాల నుంచి మూడు రోజులుగా పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. న్యూఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ దేశవ్యాప్తంగా జూ సిబ్బందికి మరింత అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహించడంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉందని అన్నారు. ఈ 3 రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నందుకు వన్యప్రాణుల కోసం డేటా మేనేజ్మెంట్, ఎన్రిచ్మెంట్ నేర్చుకోవడంలో గొప్ప ఆసక్తిని కనబరిచినందుకు పాల్గొన్న వారందరినీ ఆయన అభినందించారు. జూ పార్క్స్ డైరెక్టర్ వినరు కుమార్ మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో జూ సిబ్బంది డేటా మేనేజ్మెంట్, ఎన్రిచ్మెంట్ నిర్వహణలో మంచి జ్ఞానం, అనుభవాన్ని పెంపొందించుకున్నారన్నారు. అనంతరం డాక్టర్ సంజరు కుమార్ శుక్లా, వినరు కుమార్ లు జూ క్యూరేటర్ ఎస్ రాజశేఖర్, సెంట్రల్ జూ అథారిటీ, న్యూ ఢిల్లీ అధ్యాపకులు మజర్ గార్డెన్, నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఫికస్, బనియన్ చెట్ల నమూనాలను నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.