Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆర్ అండ్‌బీ అనుమతి లేక నిలిచిపోయిన డ్రినేజీ పైపులైన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. అంబర్‌పేట మెయిన్ రోడ్డు ప్రజా అపార్ట్మెంట్ లేన్‌లో నిలిచిపోయిన డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధర్మారెడ్డి, జల మండలి డీజీఎంలు విష్ణువర్ధన్‌రావు, మాజీద్లతో కలిసి కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ ఆండ్ బీ అనుమతి లేకపోవడంతో డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులు నిలిపివేశారని, దీంతో ఎరుకల బస్తీ, తూరబ్నగర్ ప్రాంతాలలో డ్రయినేజీ పొంగి మంచినీరు కలుషిమవుతుందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. ఆర్అండ్బీ అధికారులకు సమస్యను వివరించగా వారు నిలిచిపోయిన పనులకు అనుమతించారని చెప్పారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి, నాయకులు చుక్కా జగన్, జమ్మిచెట్టు బాలరాజ్, గుగ్గిళ్ళ శ్రీనివాస్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.