Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
తాగునీటి సమస్య పరిష్కారానికి వెంటనే పైప్లైన్ నిర్మాణాలు చేపట్టాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె రాజు జలమండలి అధికారులకు సూచించారు. ఆదివారం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం రాజీవ్ గృహకల్పలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక ప్రజలు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మన్నె రాజు మాట్లాడుతూ మంచినీరు, రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ ఆధునీకీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ముఖ్యంగా మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప స్థానిక ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.