Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన సంప్రదాయ నృత్య ప్రక్రియల సమాహారంగా శ్రీత్యాగరాయ గాన సభ వేదిక నిలిచింది. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ నిర్వహణలో రెండు రోజుల నృత్యోత్సవ్లో ఆదివారం మహారాష్ట్రకు చెందిన పద్మ శ్రీ దర్శన జవేరి మణిపురి నాట్య ప్రక్రియలో నవరసాలను ప్రదర్శించారు. న్యూ ఢిల్లీకి చెందిన హుస్నైన్ స్థాపించిన వుయి ఆర్ వన్ వికలాంగ కళాకారులు తమ కుర్చీలలో కూర్చునే అద్భుత నాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యంలో ముంచారు. హాంగ్‌కాంగ్ నుంచి వచ్చిన రూప కిరణ్ భరత నాట్యం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ రఘుపత్నురి కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో కళకారులకు గోల్కొండ జీవిత సాఫల్య పురస్కారాలు, డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, పసుమర్ధి శేషుబాబు, పద్మ కల్యాణ్, విక్రమ్, కిరణ్మయి బహుకరించారు.