Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
టీఆర్ఎస్ మైనార్టీ నాయకునికి ప్రభుత్వపరంగా అండగా ఉండాలని ఆపార్టీ అంబర్పేట ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి హోంమంత్రి మొహమూద్ అలీకీ విజ్ఞప్తి చేశారు. అంబర్పేట డివిజన్ చెందిన మైనార్టీ నాయకులు బాబా ఇటీవల హోం మంత్రి మహమూద్ అలీ కాన్వారుని అడ్డుకున్నాడని ఆరోపణలతో అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ పులి జగన్, పద్మావతి డిపి రెడ్డి, సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, ఎక్కాల కన్నా, తోలుపునూరి కృష్ణ గౌడ్, నాగేష్ గౌడ్ హోం మంత్రిని కలిశారు. బాబాపైన అక్రమ కేసులు నమోదు చేస్తే మైనార్టీ వర్గాలో తప్పుడు సాంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, వెంటనే దీని సరిదిద్ది బాధ్యుల పైన చర్యలు తీసుకోని బాధిత కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనార్ద న్, రాహుల్ తదితర నాయకులు పాల్గొన్నారు.