Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం తార్నాక డివిజన్ లాలాపేటలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పాదయాత్రగా వెళుతూ ప్రజలను కాలనీ సంక్షేమ సంఘాలను కలిశారు. శ్రీపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సత్యనగర్‌లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. లాలాపేట్ ఓపెన్ నాలా ప్రక్కన సుదీర్ఘ కాలంగా అపరిష్కతంగా ఉన్న పక్కా రోడ్డు నిర్మాణానికి రైల్వే అధికారులతో మాట్లాడతామన్నారు. వినోభా నగర్లో ఇప్పటికే ఎంపీ నిధుల ద్వారా నిర్మాణం చేస్తున్న కమ్యూనిటీ హాల్‌తో పాటు అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. దీంతో పాటుగా పలు నిర్వహణ పరమైన సమస్యలను స్థానికులు కేంద్ర మంత్రి దష్టికి తీసికురాగా వాటిపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్. జలమండలి అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి. రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము వర్మ, సీనియర్ నేతలు వేణు యాదవ్, గణేష్ ముదిరాజ్, ఉపేందర్ యాదవ్, అనిత, సత్యవతి, బీజేపీ జిల్లా కార్యదర్శి వీరన్న, కిరణ్, మల్లేష్, పోచయ్య, వివిధ కాలనీ సంఘాల నాయకులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.