Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోనూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే విద్యార్థుల స్పోర్ట్స్ మీట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ పోటీల్లో 50 పాఠశాలలకు చెందిన వెయ్యికి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం తరగతి గదుల్లో పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడిల నుంచి విద్యార్థులకు క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని, క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. పోటీల్లో భాగంగా ఖైరతాబాద్, అమీర్‌పేట్ మండల్ రికగ్నైజేడు పాఠశాల కమలాపురి కాలనీలోని ఇండియన్ బ్లూమ్స్ హైస్కూల్ విద్యార్థి డి. ఆకాష్ రన్నింగ్ రేస్‌లో మొదటి బహుమతి అందుకున్నారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె. శివ నారాయణను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ యాదయ్య, అసోసియేషన్ అధ్యక్షులు అగస్టీన్, జనరల్ సెక్రటరీ సుధాకర్, ఖుతుబుద్దీన్, వీవీరావు, ప్రసాద్, ఉమా మహేశ్వర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.