Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలో సీఐటీయూ సౌత్ అధ్యక్షులు మీనా
నవతెలంగాణ-ధూల్‌పేట్
కేంద్ర కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ సౌత్ జిల్లా అధ్యక్షులు మీనా డిమాండ్ చేశారు. సౌత్ జిల్లా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు అనుకూల విధానాలను వీడనాడాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో పౌరులందరికీ సమానమైన అవకాశాలను సమకూర్చడమే ప్రజాస్వామ్యం అన్నారు. లౌకిక ప్రజాతంత్ర భారతం కావాలని, ప్రభుత్వానికి దేశం బాగుండాలని ధ్యాసే లేదన్నారు. ఎప్పటికీ దేశీయ, విదేశీయా బడా కార్పొరేట్లను ఎలా సంతృప్తి పరచాలన్నదే చూస్తుంది కానీ ప్రజా పాలనను గాలికి వదిలేసారు అన్నారు. దేశంలో 90% పైగా శ్రామిక శక్తి, అసంఘటిత రంగంతోనే ఉందన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చెమట చేసి ఈ సమాజ అవసరాలకు కావలసిన సరుకులను, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కార్మిక ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే జంగయ్య, కోటయ్య, కిషన్ జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.