Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
షేక్‌పేట్‌లోని జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఐఎస్టీఈ (ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) విద్యార్థుల చాప్టర్ 'వన్-డే నేషనల్ లెవల్ స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం ఇగ్నియం-2022' విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ, చుట్టుపక్కల ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో, ఆర్అండ్డీ తాజా సాంకేతిక పోకడలను ప్రదర్శించి హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాలేజీ వైస్-ప్రిన్సిపల్ డాక్టర్. కె. రామ లింగారెడ్డి, వివిధ విభాగాల హెచ్ఓడీ లు, ఐఎస్ టీఈ ఫ్యాకల్టీ, స్టూడెంట్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.