Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
- కలెక్టర్, డీఎంహెచ్ఓతో వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
2023 జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రణాళికాబద్ధంగా నిర్వహిం చి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత కంటి వెలుగును విజయవంతం చేయాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవ సరం ఉందన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 27,75,067 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 75 బృందాలను, జీహెచ్ఎంసీ వార్డులలో 40, జీహెచ్ఎంసీ పరిధిలో 43 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 61 గ్రామపంచాయతీలకు రూరల్ బృందాలు (టీమ్)లను 10, అర్బన్, లోకల్ బాడీలకు సంబంధించి 13 ప్రాంతాలకు 13 బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలలిపారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా మరో నాలుగు అదనపు బృందాల ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జిల్లాలోని ఆయా పీహెచ్సీలలో వైద్యులు, ఆయుష్ వైద్యులు, రాష్ట్రీయ బాలస్వస్థ్ కార్యక్రమం వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కారకర్తలు అందుబాటులో ఉంటా రని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీ గా, మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ఏ రోజు వైద్య శిబిరం ఎక్కడ నిర్వహించేది వైద్య బృందాలకు ఎక్కడ వసతి ఏర్పా టు చేయాలనే విషయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించా ల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కె.ఆనంద్, జిల్లా మాస్ మీడియా అధికారి జి.వేణుగోపాల్ రెడ్డి, డీఎంపీవో మంజుల పాల్గొన్నారు.