Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దశల వారీగా ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు విష్ణుపురి కాలనీలో రూ.5 లక్షలతో నూతన సీసీ రోడ్డు, ఎస్వీ నగర్ రోడ్డు నెంబర్ 3లో రూ.2 లక్షలా 50 వేలతో భూగర్భ డ్రయినేఈ పనులను చంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ కొమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.