Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం దమ్మా యిగూడ మున్సిపాలిటీలోని 7వ వార్డు ప్రగతి నగర్ కాలనీలో భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం రూ.6 లక్షలా 70 వేలు, 7వ వార్డు ఖుషి గార్డెన్ భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం రూ.5లక్షలు, 7వ వార్డు వికాస్ నగర్లో భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం రూ.10 లక్షలు, 16వ వార్డు శ్రీరామచంద్ర కాలనీ సీసీ రోడ్డు రోడ్డు నిర్మాణానికి రూ.14 లక్షలు, 17వ వార్డు ఎంఎన్ఆర్ కాలనీలో సీసీ రోడ్డుకు రూ.6 లక్షలు, 17వ వార్డు బాల్ రెడ్డి నగర్ భూగర్భ మురికి కాలువ నిర్మాణం కోసం రూ.10 లక్షలు, మొత్తం రూ.51 లక్షలా 70 వేలతో చేపట్టనున్న పనులకు మంత్రి మున్సిపల్ చైర్ పర్సన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్‌తో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, డీఈఈ సుమతి, కౌన్సిలర్లు నాగాయి పల్లి సుజాత, మంగల్ పురి వెంకటేష్, కొత్త సురేఖ, మాదిరెడ్డి పావని రెడ్డి, సంపన్ బోల్ స్వప్న, పాండాల అనురాధ, వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహారెడ్డి, మోర మౌనిక, రామారం శ్రీహరి గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు కందాడి చెన్నారెడ్డి, వహీదా బేగం పాల్గొన్నారు.