Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి తెలిపారు. కాప్రా డివిజన్ పరిధిలోని కేసీఆర్ మల్లికార్జున నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మాటి కిరణ్ కుమార్ రావు ఆధ్వర్యంలో కాలనీ వాసులతో సమావేశం అయ్యారు. గురువారం కార్పొరేటర్ స్వర్ణరాజ్, వాటర్ ఏఈ రోహిత్‌తో కలిసి కాలనీలో పర్య టించారు. అనంతరం కాలనీవాసులతో కలిసి రోహిత్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రయినేజీ కలెక్షన్ మంచినీటి కలెక్షన్ లేని వారు త్వరగా కలెక్షన్ తీసుకోవాలని సూచించారు. కొత్త రోడ్డు నిర్మించిన తర్వాత మళ్లీ తవ్వడం లాంటి పనులు చేస్తే మళ్ళీ రోడ్డు చిన్నాభిన్నం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు కమిటీ సభ్యులు కొప్పుల కుమార్, పవన్ కుమార్, కాప్రా బీసీ. సెల్ అధ్యక్షుడు ఉష్క మల శ్రీనివాస్, ఏరియా కమిటీ మెంబర్ మచ్చ పాండు గౌడ్, పడమటి మల్లారెడ్డి, రాజుగౌడ్, మహేష్ యాదవ్, టీడీపీ నాయకులు శ్రీరాములు, కాలనీవాసులు వాసంశెట్టి రాంబాబు, మెరుగు మహేష్, సోఫియా, సమ్మక్క, కేతమ్మ, ఎల్లమ్మ, లలిత, ప్రమీలమ్మ, తదితరులు పాల్గొన్నారు.