Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2022 ఆహ్వాన పత్రికను అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రధాన సల హాదారులు, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సి.పార్థ సారథి, తెలంగాణ భాషా, సాంస్కతిక శాఖ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో 16వ తేదీన జాతీయ బహుభాషా నాటకోత్సవం ఈ నెల 12-14 వరకు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఈ నాటకోత్సవం ఆహ్వాన పత్రికను అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రధాన సలహాదారులు, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిష నర్ సి.పార్థసారథి గురువారం వారి కార్యాల యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్లిష్ట స్థితిలో ఉన్న నాటకరంగం కరోన తర్వాత మరింత క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళింది. కళాకారులకు అవకా శాల్లేని ఈ పరిస్థితుల్లో బతుకుదెరువుకు వేరే రంగాలకు తరలిపోతున్న సమయంలో వారిని ప్రోత్సహి స్తూ బహుభాషా నాటకోత్సవం నిర్వహించడం అభినందనీ యం అన్నారు. అభినయ థియేటర్ ట్రస్ట్ కరోనా సమయంలో వేలాది మంది పేదలకు, పేద కళాకారులకు చేయూతను ఇచ్చిందన్నారు. ఈ సంస్థ డిసెంబర్ 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రవీంద్రభారతిలో నిర్వహిం చనున్న 16వ అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2022లో మణిపూరి, మరాఠీ, తెలుగు, బహుభాషా నాట కం మొత్తం 4 నాటకాలతో పాటు కూచిపూడి నృత్య నాటికలు కూడా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కార్యదర్శి అశోక్ కుమార్, అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షులు అభినయ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.