Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ సర్పంచ్ కట్టెల రాములు
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న జల్పల్లి మున్సిపాలిటీలో జల్పల్లి గ్రామంలో ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి రోడ్ల సమస్యను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహకారంతో జల్పల్లి ముత్యాలమ్మ దేవాలయం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రావ్ విగ్రహం వరకు, అదేవిధంగా జలపల్లి గేటు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తునట్లు తెలిపారు. గురువారం జల్పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు, జల్పల్లి ఎంఆర్పీఎస్ నాయకులు యంజాల శివకుమార్, దేవేందర్, రాకేష్, నరేందర్‌లతో కలిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జల్పల్లి గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి వివిధ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు.