Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకే ట్రస్టు .. సేవలేమో కార్పొరేట్ల వారికే
- వారు చెప్పిందే వినాలి ప్రశ్నిస్తే తిప్పలు తప్పవు
నవతెలంగాణ-బంజారాహిల్స్
పేదలకు పెద్ద ఆస్పత్రిలో పడి కాపులు తప్పడం లేదు. పేరుకే ట్రస్ట్.. సేవలమో బడా బాబులకు అందిస్తున్నారు. ఎల్వీ ఆస్పత్రిని సామాన్య మధ్యతరగతి నిరుపేద ప్రజలు అదో నేత్ర నిలయంగా భావిస్తారు. తమకు వచ్చిన కంటి జబ్బులు నూటికి నూరుపాళ్లు నయమైతాయని వచ్చే వారి నమ్మకాన్ని వమ్ము చేసుకొని తిరిగి ప్రభుత్వ ఆస్పత్రి వైపు పయనం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టించుకునే నాధుడు ఉండటని రోజుల తరబడి తిరిగి సమయం వృధా చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని కూడబెట్టిన సొమ్ము ఖర్చు అయిన పర్వాలేదు ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయని భావిస్తారు నిరుపేద కుటుంబాలు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్లపై ఆధారపడి చికిత్స కొరకు వస్తే వెయిటింగ్లో ఉండాలే గానీ ట్రీట్మెంట్లు లేవనీ ఎల్వీ ప్రసాద్‌లోని బాధితులు వారి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. వేరు రాష్ట్రాల జిల్లాల నుంచి వచ్చేవారు ఇక్కడ అద్దె రూముకు తీసుకొని చికిత్స వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.
ఆస్పత్రి యజమాన్యం వైద్యుల పనితీరు సక్రమంగా ఉన్న కింది స్థాయి సిబ్బంది సెక్యూరిటీ ఏజెన్సీ వారు ఒకలాగా ఉందని బాధితులు వాపోతున్నారు.
బంజారాహిల్స్‌లోని హాస్పిటల్ హిల్స్ ప్రాంతాల ప్రజలకు మాదిరిగానే ట్రీట్మెంట్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
ఇటీవల చికిత్స చేయించుకున్న మహారాష్ట్రవాసి మధ్యప్రదేశ్ వాసులు వారి కుటుంబ సభ్యులకు జరిగిన చికిత్స గురించి చెబుతూ వాపోయారు.
ఆస్పత్రిలో వైద్యులు చికిత్స మెరుగ్గా అందించి దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆస్పత్రి అంతర్గతంగా లేదా చికిత్స తీసుకున్న వారి అభిప్రాయాల్లో మాత్రం ఏమాత్రం పొంతన లేకుండా ఉందని బాధితులు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆరోగ్య శాఖ అధికారులు ఇకనైనా స్పందించి తనిఖీలు నిర్వహిస్తే అసలు జరుగుతున్నది ఏమిటో పూర్తిగా తెలుస్తుందని తెలియజేస్తున్నారు.