Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ వారి సమస్యలు చేసుకునేందుకు గత మూడు రోజులుగా పాదయాత్ర చేస్తున్న గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ భీష్మ ముగింపు ప్రజా పాదయాత్ర మహాసభను నేతాజీ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ కార్పొరేటర్‌గా ఎన్నికైన రెండు సంవత్సరాల సందర్భంగా ప్రజా పాదయాత్రను చేపట్టి విజయవంతంగా ముగించడం అభినందనీయం అన్నారు. పార్టీలో దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందాడని అన్నారు. ఈ రెండేళ్లలో కార్పొరేటర్ దంపతులు చేసిన అభివృద్ధిని పుస్తక రూపంలో ప్రజల ముందు పెట్టి ఎవరు చేయనటువంటి సాహసాన్ని వీరు చేయటం అభినందనీయం అన్నారు. ఇది కార్పొరేటర్లకు మార్గదర్శకం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణ, గన్‌ఫౌండ్రి డివిజన్ ఇన్చార్జ్ జ్ఞానేశ్వర్, పాదయాత్ర ఇన్చార్జ్ రాకేష్, కిషోర్, అరవింద్, రంజిత్ కుమార్, నిర్మల్ రాజ్, రఘునందన్ యాదవ్, పరమేశ్వరి, బాబురావు, నితిన్, రాణి తదితరులు పాల్గొన్నారు.