Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పాడైపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టి వెంటనే విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం చే నెంబర్ జంక్షన్ మధురానగర్ కాలనీలో పర్యటించి పాడైపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మధురానగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ను పాడైపోవడంతో మోబైల్ ట్రాన్స్ఫాÛర్మర్ ఏర్పాటు చేశారని, ఫ్లై ఓవర్ పనుల కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చుక్కా జగన్, జమ్మి చెట్టు బాలరాజ్, మిరియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.