Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు ఆదివారం బీజేపీ రాష్ట కార్యాలయంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ సీనియర్ జాతీయ నాయకులు మంథని సామెల్ మాదిగ, నలిమెల విజయరావు మాదిగ, వీఎస్. రాజు మాదిగ, ఎరుపుల విష్ణు మాదిగ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ గజ్జల రాజశేఖర్ మాదిగ, కొండరపల్లి శివ కుమార్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.