Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హోమ్ బిల్డింగ్, రెనోవేషన్ రిటైల్ కోసం భారత్‌లో సుప్రసిద్ధ ఓమ్మీ ఛానెల్ కేంద్రంగా ఐబీఓ తమ కార్యకలాపాలను దక్షిణ భారతదేశంలో విస్తరిస్తూ హైదరాబాద్ నగరంలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించినట్లు ఐబీఓ, సీఈఓ రిటైల్ వెంకటేశ్వర్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రవేశం ఒక్క సంవత్సరంలోనే ఈ బ్రాండ్ మూడు నూతన మార్కెట్లోకి ప్రవేశించిందన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న హోమ్ బిల్డింగ్, రెనోవేషన్ రిటైల్ మార్కెట్‌ను వ్యవస్థీకృత మార్కెట్‌గా మార్చడం లక్ష్యంగా చేసుకుందన్నారు. విలువైన ధరల వద్ద హోమ్ బిల్డింగ్ రిటైల్, హోమ్ ఇన్నోవేషన్‌ను వినియోగదారులకు అందించడం ద్వారా తమ ఓమ్మీ ఛానెల్ అనుభవాలను విస్తరించాలనే బ్రాండ్ నిబద్దతలకు ఈ విస్తరణ జరిగిందని చెప్పారు. 200 బ్రాండ్లకు చెందిన 4 వేల ఉత్పత్తులను ఒకే చోట హోల్ సేల్ ధరలకు ఐబీఓ అందిస్తూ గృహ యజమానులు, హోమ్ బిల్డింగ్ ప్రొఫెషనల్, ఇంటీరియర్ డెకరేటర్స్, ఆర్కిటెక్స్, బిల్డర్లకు వారి 2మ్ బిల్డింగ్, హోమ్ ఇంప్రూవ్ మెంట్ అవసరాలను తీర్చనుందన్నారు. ఐటీ, ఐటీఈఎస్ తయారీ కేంద్రాల కోసం అంతర్జాతీయ కేంద్రంగా నగరం వెలుగొందుతుందని, దీంతో నగరంలో నూతన తరపు గృహ యజమానులు కనిపిస్తున్నారన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ గణనీయంగా వృద్ధి చెందుతుందని, ఇది గృహ నిర్మాణం, గృహ అభివృద్ధి హోమ్ ఇంటీరియర్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.