Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తారా మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కుష్టు వ్యాధి నిర్మూలనకు ఉచిత వైద్యం, మందులు అందిస్తున్నామని తారా మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తార మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రతి బస్తీల్లో కుష్టు వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఆశావర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. కుష్టు వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఉచిత వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు ఉచితంగా అందిస్తామన్నారు. ఈ సర్వే ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. చలి రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో చిన్నపిల్లలు, వృధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.