Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పూలే, అంబేద్కర్, కాన్షీరాం వంటి మహనీయుల సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారానే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ 2023 అక్టోబర్ 25న ఢిల్లీలో జాతీయ సదస్సు, కువైట్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం విజయ లలిత, కర్ణాటక మహిళా అధ్యక్షులు వెంకమ్మ, తమిళనాడు అధ్యక్షులు ప్రొఫెసర్ తమిళ్ రసన్, కేరళ రాష్ట్ర రా మంకిరి, ఆంధ్రప్రదేశ్ నాయకులు శాఖ నరేష్, ఉపాధ్యక్షులు బాబు, రాష్ట్ర నాయకులు ఆరేపాక ప్రమోద్ కుమార్, నిరుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.