Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
ఈనెల 21న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగసభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం బౌద్ధనగర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21న ఖమ్మంలో జరుగనున్న బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి రోడ్డుమార్గంలో బేగంపేట్, సంగీత్ చౌరస్తా, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్ మీదుగా వెళ్లనున్నారని, సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు, అభిమానులు, పెద్దఎత్తున సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షులు గరిగే ప్రవీణ్ కుమార్, గండికోట విజయ్ కుమార్, జి. వి కృష్ణ, తడక వినోద్ కుమార్, కాత విజరు కుమార్, ప్రధాన కార్యదర్శులు చందర్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు మంద వెంకటస్వామి, విక్రమ్ పాల్గొన్నారు.