Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కెంబసారం కృష్ణ
నవతెలంగాణ-ముషీరాబాద్
రాష్ట్రంలో దళితబంధు తరహాలో ఎరుకల జాతిని దృష్టిలో ఉంచుకుని 'గిరిజన బంధు' ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెంబసారం కృష్ణ, కూరాకుల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఫ్‌ు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా కెంబసారం కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కూరాకుల కృష్ణ, ఉపాధ్యక్షులుగా దేవసరి కృష్ణ, నర్సింహా, కార్యదర్శిగా శ్రీనివాసరావు, అశోక్, కోశాధికారిగా విజయకుమార్, బిజిల్లి సత్యనారాయణ, సలహాదారులుగా నిమ్మచంద్రయ్య, పి. మల్లేష్, కె.పాండు, లీగల్ అడ్వైజర్లు ఎ. శంకర్, బాల్ రాజు, నూతనంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే 30 జిల్లాలకు నూతనంగా కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు.