Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా దుర్గం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీలో 30% జీతాలు పెంచడానికి నిర్ణయించడం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. ఇతర రంగాల్లో ఉన్న కార్మిక ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు కేసీఆర్ పరిష్కరిస్తున్నారని అన్నారు. ఉద్యోగులు కార్మికులు ఐక్యంగా ఉండేవారు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీ కార్మికులకు ఉద్యోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. జనవరి మూడో వారంలో తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ మొదటి మహాసభలను హైదరాబాదులో నిర్వహించాలని తీర్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి రఫీ యుద్దీన్, కోశాధికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.