Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ అందించే ప్రత్యేక కార్యక్రమానికి అమీర్‌పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి స్వీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత దేశంలోనూ కోవిడ్‌కు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవాలనుకొంటున్న వారి సంఖ్య పెరుగుతుండటన్ని గమనించి అవసరమైన వారికి వ్యాక్సిన అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం 88866 57894 ను సంప్రదించి పొందవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హైదరాబాదు నగర శివార్లలలో ఉన్న ప్రత్యేకమైన గేటెడ్ కమ్యూనిటీ అయిన పెబెల్ సిటీలో నిర్వహించారు. సుమారు 250 మందికి పైగా సిటీవాసులు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయించుకోవాలను కొనే గృహ సముదాయాలు లేదా కాలనీ వారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తోంది.