Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికుల్లో అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణ చర్యలు
- కేసుల ఛేదన, విచారణలో కృషి
- సైబర్ క్రైమ్స్ కట్టడి చేసేందుకు అవగాహన కార్యక్రమాలు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్లో నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. స్థానికుల్లో అవగాహన కల్పిస్తూ నేరాల కట్టడికి పోలీసులు నిరంతర చర్యలు చేపడుతున్నారు. కేసుల ఛేదనలో, విచారణలో, అపహరణకు గురైన సొమ్ము రికవరీలో వేగవంతం పెంచుతూ సత్ఫలితాలు సాధించారు. ఓయూ ఉద్యమాలకు కేంద్ర బిందువు కావడం వల్ల ఇక్కడ విద్యార్థుల భద్రత, వర్సిటీ భద్రత, ధర్నాలు, ర్యాలీలు, ఆందోళన జరిగిన్నప్పుడు బందోబస్తు వంటివి పోలీసులకు సవాలుగా నిలుస్తున్నాయి. వీటిన్నింటితో పాటుగా పీఎస్ పరిధిలో సీసీఎంబీ, ఎన్ఐఎన్, ఇఫ్లూ వంటి ప్రముఖ జాతీయ పరిశోధన కార్యాలయాలు ఉండటంతో నిత్యం పోలీసులు నిఘా అవసరం ఎంతైనా ఉంది. శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో సమర్ధవంతంగా పనిచేస్తూ అటు స్థానికుల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఇటు ఎస్ఐలు, కానిస్టేబుల్స్, సిబ్బందిని సమన్వాయం చేసుకుంటూ నేర రహిత సమాజం కోసం, ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తితో ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.
ప్రజల్లో ఉంటూ క్రైమ్, హాట్ స్పాట్స్ వద్ద పెట్రోలింగ్, సీసీ కెమెరాల నిఘా, మానిటరింగ్ సమస్య, తలెత్తిన వెంటనే బ్లూకోర్ట్స్, పెట్రో కార్, తనిఖీలు వంటివి నిర్వహిస్తూ అలర్ట్‌గా ఉంటున్నారు. దొంగలించిన సొమ్మును రికవరీ చేయడంలో ఈస్ట్ జోన్ పరిధిలో ఓయూ పీఎస్ ముందుంది. గతంలో కంటే కేసులు పెరిగిన వాటి పరిష్కారంలో ముందున్నారు. 102 కేసులు టార్గెట్‌లో 81 కేసులే ఉన్నాయని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా నిత్యం స్థానికంగా ఉండే ఉత్పనమవుతున్న సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన
ఓయూ పీఎస్ పరిధిలో నిత్యం సైబర్ నేరాలు కాస్త పెరగడంతో కాలనీ, అపార్ట్‌మెంట్స్‌లలో, విద్యా సంస్థల్లో విద్యార్థులకు, యూత్ ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. డయల్ 100, హాక్ ఐ వంటి యాప్స్‌ని వినియోగించుకొని సమస్యలు ఉంటే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ సూచించారు. సైబర్ క్రైమ్స్ గతంలో కంటే పెరిగాయని చెప్పారు. ఈస్ట్ జోన్ డీసీపీ, అడిషినల్ డీసీపీ, కాచిగూడ ఏసీపీ ప్రోత్సాహం, సహకారాన్ని తీసుకొని ముందుకు పోతునట్లు చెప్పారు. తన కింద సిబ్బంది కృషి, ఉద్యోగ ధర్మాన్ని ఇన్స్పెక్టర్ ప్రశంసించారు. ఇక ఓయూలో పూర్వ విద్యార్థి కావడంతో పాటుగా ఇక్కడ ప్రొఫెసర్స్ ఉద్యోగులతో ఉన్న సంబంధాలతో ముందుచూపు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ఓయూ విద్యార్థులను సమన్వాయం చేయడంలో ఇన్స్పెక్టర్ చొరవ ప్రశంసలు అందుకుంటున్నారు.