Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తార్నాకలోని వంజరి భవన్లో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వంజరీ సంఘం నూతన 2023 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వంజరి సంఘం కోసం ఒక ఎకరం స్థలం ఉప్పల్ భగాయత్‌లో కేటాయించినందుకు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఎంతో రుణపడి ఉంటారని తెలిపారు. వంజరులు వారి సామాజిక వర్గానికి చెందిన పేదలకు, వృద్ధులకు, పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రశంసించారు. కార్యక్రమంలో కొండల్, ముతరు, అమరేందర్, సురేందర్, విజయ్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.