Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూసిన ఎస్ఎఫ్ఐ నవతెలంగాణ-జూబ్లీహిల్స్
బోరబండ గురుకుల హాస్టల్లో సీట్లు ఇప్పిస్తామని గెస్ట్ ఫ్యాకల్టీ ప్రసాద్ దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల 50 వేల వరకు విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులను సంప్రదించగా, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి నాయకత్వంలో 20 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు, వారు ఇచ్చినటువంటి డబ్బును, ప్రసాద్ వద్ద నుంచి ఇప్పించారు. ఈసందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్యదర్శి సునీల్, తల్లిదండ్రులు వీరేష్, రాజేష్, రంజిత్, గోపాల్, కృష్ణవేణి పాల్గొన్నారు.