Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం కోసం మాత్రమే పోరాటం చేయండి
- అట్రాసిటీపై ఫిర్యాదు రాగానే కేసు నమోదు : ఏసీపీ
నవతెలంగాణ-హయత్‌నగర్
భారత రాజ్యాంగంలో కేవలం అణగారిన వర్గాలను మను షులుగా గుర్తించకుండా సమాజంలో కొందరు చాలా హీనంగా చూస్తున్నారని, ముందు చూపుతో వారి జీవితాల్లో వెలుగులు చూడాలని 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేశారు. అందులో కొన్ని దళిత, గిరిజన మహిళలు, బాలికలపై, అత్యాచారాలు, దాడులు జరిగినప్పుడు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారు. పోలీసులు లైంగిక దాడి జరిగిన మహిళకు వైద్య పరీక్షలు జరిపి, మహిళా పోలీస్ అధికారితో స్టేట్మెంట్ చేశాక, ఆ తరువాత కూడా స్థానిక కోర్టు జడ్జితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు వస్తే నిందితుడిపై పొక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తారు. అదేవిధంగా దళితుడు, గిరిజనుడు అని తెలిసి అతనిపై దాడి చేసినా, కొట్లాటకు దిగినా, కులం పేరుతో దూషించినట్లు ఫిిర్యాదు రాగానే వెంటనే కేసు నమోదు చేస్తారు. ఆ తరువాత ఆన్‌లైన్‌్ ద్వారా డీసీపీకి, సీపీకి అట్టి కేసు వివరాలు వెళ్ళగానే కమిషనర్ ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిని నియమిస్తారు. కేసు నమోదు అయిన వెంటనే కలెక్టర్ కార్యాలయం నుండి బాధితుడికి 50శాతం నగదు నష్టపరిహారం రూపంలో బాధితుడి ఖాతాలో జమ అవుతాయి. ఘటనా స్థలానికి చేరుకొని సాక్షులు వాంగ్మూలం, వీడియో రికార్డ్ చేశాక నిందితుడికి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసులు అందజేసే అవకాశం కూడా అధికారికి ఉంది. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలితే అట్టి కేసును మూసివేయడానికి పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. ఒక బాధితుడికి ప్రభుత్వం నుంచి ఛార్జ్‌షీట్ వేశాక 25శాతం నగదు, నేెరస్తుడికి శిక్ష విధించిచాక 25శాతం నగదు పరిహారంగా వస్తుంది. ఎల్బీనగర్ డివిజన్లో సరూర్‌నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది 45 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పటి వరకు 6కేసులు మూసివేశారు పోలీసులు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒక ఆటోను ఇంటిని ఖాళీ చేసేందుకు మాట్లాడుకుని అతనికి సగం కిరాయి ఇచ్చారు. మిగతా కిరాయి అడిగితే అతనిపై అట్రాసిటీ కేసు పెట్టారు. ఇద్దరు స్నేహితులు కలిసి వారి ఒప్పందం ప్రకారం వాయిదా పద్ధ్దతిలో సెల్ ఫోన్ కొన్నారు. వాయిదా రూపంలో ఫోన్‌కు చెల్లించాల్సిన నగదు అడిగితే అట్రాసిటీ కేసు పెట్టారు. ఇలా ఒక్కటేమిటి ఇష్టం వచ్చినట్లు అట్రాసిటీ కేసును దుర్వినియోగపరుస్తున్నారా అని పోలీసులకు పలు విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇకనైనా మంచికి మాత్రమే, అన్యాయం జరిగినప్పుడు చట్టాన్ని సరైన పద్ధ్దతిలో ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు.
అట్రాసిటీ కేసుపై ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తాం : ఏసీపీ శ్రీధర్‌రెడ్డి
అట్రాసిటీ కేసులపై ఫిిర్యాదు రాగానే కేసు నమోదు చేసి ఉన్న తాధికా రుల సూచనల ప్రకారం దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని, అదే విధంగా మహిళలపై, యువతులపై, మైనర్ బాలికలపై జరిగే హత్యలు, హత్యాచారం కేసుల్లో వెంటనే అరెస్ట్ చేస్తామని, మొదటగా ప్రభుత్వం నుంచి 50శాతం పరిహారం, తదుపరి 50శాతం పరిహారం వస్తుందని ఎల్బీనగర్ డివిజన్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కేసుల్లో ఏ ఒక్క పోలీస్ అధికారికి సొంత నిర్ణయం ఉండదని, ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు, చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కోర్టు పరిధి ప్రకారం నడుచుకోవాలని సూచించారు.