Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వారి సహకారంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ 17వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని, కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు. కరోనా మళ్ళీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని ఆమె ప్రజలకు సూచించారు. రానున్న రోజుల్లో కరోనా ఉధృతి ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలలో తీవ్రం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి వీలైతే బూస్టర్ చేసుకోవాలన్నారు. ఈ సదుపాయాన్ని సుమారు150 మంది వినియోగించు కున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, తుర్కయంజాల మున్సిపల్ చైర్మెన్ అనురాధ రాంరెడ్డి, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బండారి మనోహర్, బాలునాయక్, నాయకులు ఎర్రజైహింద్, సుధాకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.