Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల వెంకటేష్
నవతెలంగాణ-బడంగ్పేట్
క్రీడలతో విద్యార్థులకు, యువతకు మానసిక ఉల్లాసంతో పాటు మనోదైర్యం కల్గుతుందని తలకొండపల్లి జెడ్పీటీసీ సభులు ఉప్పల వెంకటేష్ అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్లోని తెలంగాణ హాకీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్లో నిర్వహించిన 7వ సబ్ జూనియర్ ఉమెన్స్ అంతర్ జిల్లాల హాకీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఉప్పల వెంకటేష్, జడ్పీిటీసీి తలకొండపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడ అయినటువంటి హాకీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటమి చెందినవారు నిరాశ పడకుండా రానున్న రోజుల్లో గెలుపునకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఓటమిలే విజయానికి తొలి మెట్టు అవుతుందన్నారు. ఈ యొక్క టోర్నమెంట్లో మూడో స్థానంలో నిజామాబాద్ జిల్లా జట్టు రెండవ స్థానంలో హైదరాబాద్ జిల్లా జట్టు మొదటి స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా కైవసం చేసుకున్నాయని, రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ హాకీ ట్రెజరర్, భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్టత అతిథిగా పద్మశ్రీ ముఖేష్ కుమార్ తెలంగాణ హాకీ ప్రధాన కార్యదర్శి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో తనలాంటి క్రీడాకారులను దేశానికి అందించాలనే ఉద్దేశంతో ఈ అంతర్ జిల్లాల టోర్నమెంట్లు అన్ని జిల్లాల సహకారంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి గాంధీ, గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బుర్ర దశరథ్‌గౌడ్, జిల్లా అసోసియేషన్ సభ్యులు జాన్ రెడ్డి, డీపీఎస్ ఏవో భరత్ రాజు , నిరంజన్ రెడ్డి, జగన్ రెడ్డి, మనోహర్, విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాండురంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.