Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లో బండ్లగూడలో గల సహభావన టౌన్షిప్ (రాజీవ్ స్వగృహ) నివాసులకు నెలకొన్న సమస్యలను పరిష్కరించి అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. సోమవారం రాజీవ్ స్వగృహ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. అక్కడ నివాసులు భవనాలను కట్టి సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని దీంతో లీకేజీలు ఏర్పడుతున్నా యని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ కూడా లీకేజీ అవుతున్నాయని, గత వరదల్లో భాగంగా కురిసిన వర్షాలకు టౌన్షిప్ వెనకవైపు ఉన్న జీఎస్ఐ ప్రహరీ కూడా కూలిపోయిందని, దీంతో జంతువులు, విషసర్పాలు తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ఎస్టీపీి ప్లాంట్, సోలార్ ఫెన్సింగ్, ఓపెన్ జిమ్, లైట్స్, అపార్ట్మెంట్ వెలుపల, లోపల స్పీడ్ బ్రేకర్స్ను ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మతో మాట్లాడారు. బండ్లగూడ సహభావన టౌన్షిప్లో నెలకొన్న సమస్యలను వివరించారు. దానికి స్పందించిన శర్మ వెంటనే తగిన నిధులను మంజూరు చేసి సమస్యలను పరిష్కరి స్తామని అలాగే జీఎస్ఐ వారితో మాట్లాడి కూలిపోయిన ప్రహరీ గోడలు నిర్మిస్తామని భవన లీకేజీలు కాకుండా పైభాగాన ఫ్లోరింగ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేసుధీర్రెడ్డి మాట్లాడుతూ మీరు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. జీహెచ్ఎంసీి వారు చర్చించి రోడ్డుమీద స్పీడ్ బ్రేకర్లను వేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వట్నాల విశ్వేశ్వరరావు, రాధాకృష్ణ, రాజుగౌడ్, బాబు వెంకటేశ్వర్లు, నవీను, శర్మ తదితరులు పాల్గొన్నారు.