Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు రాంచందర్ నాయక్ సమక్షంలో జవహర్ నగర్ బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షునిగా మెగావత్ రాజు నాయక్‌ని ప్రకటిస్తూ నియామక పత్రం అందజేశారు. ఇంతకుముందు ఉన్న కార్యవర్గంలోని మిగతా సభ్యులను అలానే కొనసాగిస్తూ మాజీ అధ్యక్షులు దారావత్ సంజరు నాయక్‌ను జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా మెగావత్ రాజు నాయక్‌కి, కార్యవర్గ సభ్యులకు పలువురు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జవహర్ నగర్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రంగుల శంకర్ పాల్గొన్నారు.