Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కె. హరిప్రసాద్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
చైనాలో కోవిడ్ పరిస్థితి వార్తలు.. భారతదేశం, మిగిలిన ప్రపంచంపై ప్రభావం గురించి శాస్త్రీయ వాస్తవాలపై ఆధారపడని అనేక పుకార్లు చర్చలకు దారితీస్తున్నాయి. అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కె హరిప్రసాద్ అన్నారు. భారతదేశంలో హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నది. ఇది 2022 ప్రారంభంలో 220 కోట్ల డోస్‌లతో అధిక టీకా కవరేజీని అందించడం, ప్రారంభంలో ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి వల్ల ఏర్పడింది. అయితే రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రత్యేకంగా మాస్క్‌లను ఉపయోగించడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇన్ఫెక్షన్కు త్వరగా గురయ్యే ప్రమాదం కలిగిన సమూహాల కోసం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లను ఉపయోగించడం. టీకా బూస్టర్ డోస్ ఇంకా తీసుకోకపోతే, అర్హత ఉన్న అన్ని వయస్సుల వారు కూడా తీసుకోవాలి. జ్వరం, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధి లక్షణాల విషయంలో, వైద్యుడిని సంప్రదించాలి. లేదా మార్గదర్శకత్వం కోసం కోవిడ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి.
కోవిడ్‌కి సంబంధించి ఫలితాలు పాజిటివ్‌గా వస్తే ఎవరైనా పరీక్షలు చేయించుకుని, ఒంటరిగా ఉండాలి. పునరుద్ఘాటించాలంటే, భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోండి. సురక్షితంగా ఉండండి అని సూచించారు. అనవసరంగా భయభ్రాంతులకు గురై నష్టపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు.