Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్న వారిపై అణిచివేత చర్యలకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం అగదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోన్నం తరుణ్ గౌడ్ అన్నారు. మంగళవారం నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఎస్సై అర్హత పోటీల్లో పాత పద్దతోలో దృఢత్వం పోటీలను నిర్వహించాలని కోరుతూ యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనకుండా ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి మేడిపల్లి పోలీసు స్టేషనులో నిర్బంధించిన ఘట నపై ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తరుణ్ గౌడ్ మాట్లాడుతూ తాను ఎస్ఐ పోటీ పరీక్షల్లో నూతన విధానంలో లాంగ్ జంప్ నిబంధన పెట్టడంతో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయారనీ, అందుకే నూతన విధానంలో కాకుండా పాత పద్ధతిలో ఎస్ఐ అర్హత పోటీలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనకుండా మేడిపల్లి పోలీసులు యూత్ కాంగ్రెస్ నేతలను ఇండ్ల వద్ద బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు భారత రాజ్యంగం కల్పించిందనీ, మానవహక్కు లను కాలరాసేలా కేసీఆర్ సర్కారు నియంతృత్వ ధోరణిలో పాలన సాగించాలని చూస్తుందన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ ఏకమై త్వరలోనే కేసీఆర్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో యూత్ కాంగ్రెస్ నాయకులు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు తోటకూర రాహుల్ యాదవ్, తదితరులు ఉన్నారు.