Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
శ్మశాన వాటిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని జల్పల్లి మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్ అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీలో శ్మశాన వాటిక లేకపోవటం వల్ల కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కాలనీ ప్రజల సౌకర్యం కోసం శ్మశాన వాటికను అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎంతో కాలంగా కాలనీలో శ్మశాన వాటిక లేకపోవటం వల్ల ప్రజలు సుదూర ప్రాంతాలకు దహన సంస్కారాల కోసం వెల్లేవారన్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ కే.లక్ష్మినారాయణ, మారుతి కాలనీ వాసులు, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.