Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేసి ఆక్రమణకు పాలుపడుతు న్నా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిదులు పట్టించు కోవటం లేదని కోరుతూ మంగళవారం బాలాపూర్ మండల తహశీల్దార్ జనార్దన్ రావుకు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం చెరువులను సుందరీకరణ చేయటం కోసం రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి ఖర్చు చేస్తుందని తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గుడలోని కోమటికుంట సర్వే నెంబర్ 134,135,136, ఎర్రకుంట సర్వే నెంబర్ 85,86/1లోని ప్రభుత్వ ఎఫ్టీఎల్ భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్ర మంగా ఆక్రమించుకుని ప్లాట్లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇండ్లను నిర్మాణం చేసి రూ.కోట్లకు విక్రయిస్తున్నారని అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడి, ఆక్రమణకు పాల్పపడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అల్మాస్‌గూడలోని విశాఖనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పార్కు స్థలం సర్వే నెంబర్ 127,128,129లో ఉన్న ప్రభుత్వ పార్కు స్థలంను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా ఆక్రమించుకుని ప్లాట్లుగా ఏర్పాటు చేసి రూ.కోట్లకు అమ్ముకుని ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని కోట్లు గడుస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిదులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.