Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాన-తుర్కయాంజల్
రానున్న వేసవి కాలంలో మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఖాశిం గుట్టలో రూ.3.40కోట్లతో 25లక్షల లీటర్ల సామ ర్థ్యం గల మిషన్ భగీరథ ఓవర్ హెడ్ సర్వీస్ రిసర్వాయర్ ను, రాజా రంజిత్ ప్రైమ్ హౌమ్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముం దుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత ధనరాజ్, కమిషనర్ ఎమ్ ఎన్ ఆర్ జ్యోతి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు కోసిక ఐలయ్య, రమావత్ కళ్యాణ్ నాయక్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు అమరెందర్ రెడ్డి, మున్సిపాలిటీ, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కాందాడ ముత్యం రెడ్డి, మాజీ సర్పంచులు కందాడ లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, మేథరి అంజయ్య పాల్గొన్నారు.