Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పాత పోచంపల్లికి వెళ్లేందుకు బాలాజీనగర్ వరకు ఉన్న జెడ్పీ రోడ్డును కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డితో కలిసి వినాయక నగర్ కాలనీలో రూ.91.20లక్షలు, ఆర్టీసీ కాలనీలో రూ.12.80లక్షలు, ఆర్టీసీ సూపర్ వైజర్ కాలనీలో రూ.53.11లక్షలు, సీఎస్ఆర్ కాలనీలో రూ.58.50లక్షలతో కలిపి మొత్తం రూ.215.16లక్షలతో చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ డివిజన్ పరిధిలో నూతన కాలనీలు ఏర్పడుతు న్నందున నిరంతరం అభివృద్ధి జరిగితేనే అభివృద్ధి కనిపిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్ఠల్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, రఘు వీర్ రెడ్డి, కోసనం ధనలక్ష్మి, ఏఈ స్వప్న, శ్రీధర్, జగదీష్, పలు కాలనీవాసులు పాల్గొన్నారు.