Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు పొందిన భాగ్య నగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జి.రాజేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ టి.కృష్ణ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ను కలిశారు. ఈ నెల 17వ తేదీన నగరంలో జరిగిన బీఎంజీ ఈయూ సర్వసభ్య సమావేశంలో ఎన్నకున్న నూతన కార్యవర్గ జాబితాను కమిషనర్‌కు అందజేశారు. గతంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా కొనసాగిన తమ యూనియన్‌కు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆఫీసును కేటాయించాలని కోరినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా, తన యూనియనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఎంజీఈయూ నూతన కార్యవర్గం ఇదే..
భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులుగా జి.రాజేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్ఎం జాబ్రీ, వైస్ ప్రెసిడెంట్లుగా కె.కృష్ణ, జి.ఆనంద్ కుమార్, ఎండి ఆజమ్ అలీ, చిత్తారి దేవేందర్, అయూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా టి.కృష్ణ, సహ ప్రధాన కార్యదర్శిగా ఎం.రాధాకృష్ణ, కార్యదర్శులుగా జయకృష్ణ, శ్రీ హరి, సత్యనారాయణ, నాగమణి, మహిళా కార్యదర్శిగా మనోరమ, కోశాధికారిగా జి.సుదర్శన్, ఆర్గనైజేషన్ సెక్రెటరీగా ఏ.శంకర్, జోనల్ అధ్యక్షులుగా ఎం.యాదగిరి, కె.రాజు, డి.పోచయ్య, అసీదుల్లా ఖాద్రి, సయ్యద్ ఇక్బాల్, కార్యదర్శులుగా ధరం వీర్ సింగ్, ఆర్.వెంకటేష్, బాలకృష్ణ, కె.వెంకటేష్‌లను ఎన్నకున్నట్టు కమిషనర్‌కు జాబితాను అందజేశారు.