Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ మేకల కావ్య
నవతెలంగాణ-జవహర్‌నగర్
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మేయర్ మేకల కావ్య అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ 15వ డివిజన్ కు చెందిన నవోమి అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానాలో చేరగా ఆమె ఆపరేషన్ కోసం మంత్రి మల్లారెడ్డి సహాకారంతో రూ. 2లక్షల ఎల్ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదలందరికి వైద్యం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు మేకల భార్గవ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు.